గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 08, 2021 , 00:36:44

మూడో స్థానంలో హైదరాబాద్‌

మూడో స్థానంలో హైదరాబాద్‌

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ జోరు కొనసాగుతున్నది. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగకుండా దూసుకెళ్లిన హైదరాబాద్‌.. ఆదివారం నార్త్‌ ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్‌ నమోదు చేయలేకపోవడంతో మ్యాచ్‌ 0-0తో సమమైంది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ 5 విజయాలు, 8 ‘డ్రా’లతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ 2-1 తేడాతో జంషెడ్‌పూర్‌పై విజయం సాధించింది. 

VIDEOS

logo