మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 30, 2020 , 00:21:14

హైదరాబాద్‌కు ఆరో ఓటమి

 హైదరాబాద్‌కు ఆరో ఓటమి

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు పరాజయాల పరంపర కొనసాగించింది. ఎలైట్‌ గ్రూప్‌-ఏలో భాగం గా ఇక్కడి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైం ది. మొత్తంగా ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరు ఓటములను మూటగట్టుకుంది. మ్యాచ్‌ మూడో రోజైన బుధవారం 193పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ ఓపెనర్‌ మనీందర్‌ సింగ్‌(147 బంతుల్లో 107) శతకంతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు పోరాడకుండానే తొమ్మిది వికెట్లు తేడాతో ఓడిపోయింది. అంతకు ముందు ఆరు వికెట్లకు 101పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన హైదరాబాద్‌.. అక్షత్‌ రెడ్డి(71) మినహా మరెవరూ రాణించలేకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 156పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్‌ బౌలర్లలో అనికేత్‌ చౌదరి 4, తన్వీర్‌ ఉల్‌ హక్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత ఓపెనర్‌ మనీందర్‌ శతకంతో కదం తొక్కడంతో సహా ఎంకే లామోర్‌(71నాటౌట్‌) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్‌ ఓ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. 


సంక్షిప్త స్కోరు బోర్డు: తొలి ఇన్నింగ్స్‌: హైదరాబాద్‌ - 171 ఆలౌట్‌, రాజస్థాన్‌ -135 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌: హైదరాబాద్‌ 156 ఆలౌట్‌, రాజస్థాన్‌ 195/1 

logo
>>>>>>