గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 00:50:33

హుసాముద్దీన్‌కు రజతం

హుసాముద్దీన్‌కు రజతం

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో తెలంగాణ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) రజత పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో హుసాముద్దీన్‌ 1-4తో ఫ్రాన్సెస్కో మైయెట్టా (ఇటలీ) చేతిలో పోరాడి ఓడాడు. 2017లో ఇక్కడ రజతం నెగ్గిన హుసామ్‌ ఈ సారి కూడా సిల్వర్‌తోనే సరిపెట్టుకున్నాడు. అంతకుముందు భారత్‌ నుంచి పురుషుల విభాగంలో శివ థాపా (63 కేజీలు), మహిళల విభాగంలో సోనియా లాథర్‌ (57 కేజీలు) కాంస్యాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మన బాక్సర్లు ఈ టోర్నీని మూడు పతకాలతో ముగించారు.


logo