శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 25, 2020 , 00:07:36

ఫైనల్లో హుసాముద్దీన్‌

 ఫైనల్లో హుసాముద్దీన్‌

న్యూఢిల్లీ: స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన 57కిలోల సెమీఫైనల్లో ప్రత్యర్థి ఉక్రెయిన్‌ బాక్సర్‌ మైకోలా బుట్‌సెంకో గాయం కారణంగా వైదొలుగడంతో హుసాముద్దీన్‌ ఫైనల్‌ మార్గం సుగమమైంది. 2017లో ఇదే టోర్నీలో రజతం నెగ్గిన హుసాముద్దీన్‌ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. మరోవైపు మహిళల 57కిలోల సెమీస్‌లో సోనియా లాథర్‌ 2-3తో లులియా సైప్లాకోవా చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 


logo