బుధవారం 08 జూలై 2020
Sports - May 01, 2020 , 15:56:50

ప్రేక్షకులు లేకుండానే హంగేరియన్ గ్రాండ్​ప్రి

ప్రేక్షకులు లేకుండానే హంగేరియన్ గ్రాండ్​ప్రి

లండన్​: ఫార్ములావన్ రేస్ ఈవెంట్లపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతున్నది. మహమ్మారి కారణంగా ఆగస్టులో హంగేరీ ఫార్ములావన్ గ్రాండ్​ ప్రిని ప్రేక్షకులు లేకుండా జరుపుతామని నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. 500మంది కంటే ఎక్కువ ప్రజలు ఒకేచోట చేరడాన్ని ఆగస్టు 15వ వరకు అక్కడి ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రేక్షకుల సమక్షంలో రేస్ జరుపలేమని, ప్రజల్లో టీవీల్లో చూడొచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన హంగేరీ గ్రాండ్​ప్రి జరగాల్సి ఉంది. కరోనా కారణంగా జూన్​ 28న జరగాల్సిన ఫ్రెంచ్ గ్రాండ్​ప్రి ఇటీవలే రద్దు రద్దయింది. జూలై 19న జరగాల్సిన బ్రిటీష్ గ్రాండ్​ ప్రిని సైతం ప్రేక్షకులు లేకుండా జరుపుతామని నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 


logo