సోమవారం 06 జూలై 2020
Sports - Apr 27, 2020 , 08:33:29

పుజారాను ట్రోల్ చేసిన‌ గబ్బ‌ర్

పుజారాను ట్రోల్ చేసిన‌ గబ్బ‌ర్

న్యూఢిల్లీ:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్న ప్లేయ‌ర్లు.. సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. టీమ్ఇండియా టెస్టు ఆట‌గాడు చ‌తేశ్వ‌ర్ పుజారా సామాజిక మాధ్య‌మాల్లో పంచుకున్న ఓ ఫొటోను స్టార్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ ట్రోల్ చేశాడు. 

గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో దుమ్మురేపిన పుజారా.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పంచుకున్నాడు. `లాక్‌డౌన్ స‌మ‌యంలో నేను అత్య‌ధికంగా మిస్ అవుతున్న‌దిదే. క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉండ‌టం క‌ష్టం` అని వ్యాఖ్య జోడించాడు. దీనిపై స‌ర‌దాగా స్పందించిన గ‌బ్బ‌ర్.. `అబ్బా.. నిజ‌మా, నువ్వు క్రికెట్‌ను మిస్స‌వుతున్నావ‌ని మేము అనుకోలేదు` అని రాసుకొచ్చాడు. దీనిపై పేస్ బౌల‌ర్ ఉమేశ్ యాద‌వ్ కూడా స్పందించాడు. 


logo