సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 05, 2020 , 00:12:27

ఐపీఎల్‌ ప్రైజ్‌మనీలో భారీ కోత

 ఐపీఎల్‌ ప్రైజ్‌మనీలో భారీ కోత

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రైజ్‌మనీని బీసీసీఐ సగానికి సగం తగ్గించింది. ఇంతవరకు ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు దక్కుతుండగా.. దాన్ని రూ.10 కోట్లకు కుదించింది. రన్నరప్‌ జట్లు ఇంతకాలం రూ.12.5 కోట్లు అందుకోగా ఇప్పటి నుంచి రూ.6.25 కోట్లే దక్కనున్నాయి. క్వాలిఫయర్స్‌లో ఓడిన రెండు జట్లకు చెరో రూ.4.3 కోట్లు అందనున్నాయి. ఈ సమాచారాన్ని బీసీసీఐ బుధవారం అన్ని ఫ్రాంచైజీలకు చేరవేసింది. ఫ్రాంచైజీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాయని, స్పాన్సర్‌షిప్‌లు సహా చాలా మార్గాల్లో వాటికి ఆదాయం వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చే రాష్ట్ర క్రికెట్‌ సంఘానికి ఒక్కో మ్యాచ్‌కు ఫ్రాంచైజీ రూ. కోటి, బీసీసీఐ రూ.50 లక్షలు ఇవ్వనుంది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఈ నెల 29న ప్రారంభం కానుంది.


logo