సోమవారం 30 నవంబర్ 2020
Sports - Sep 19, 2020 , 19:26:10

ఆఫ్‌లైన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ వాడుకోవడం ఎలా?

ఆఫ్‌లైన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ వాడుకోవడం ఎలా?

న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్‌  సాయంతో మనకు కావాల్సిన, వెళ్లాల్సిన ప్ర‌దేశాన్నైనా  గుర్తించొచ్చు.  ఎక్క‌డి ప్రాంతాన్నిఅయినా  కూర్చున్న‌చోటే చూసేయొచ్చు. మొబైల్‌ ఇంటర్నెట్‌ డేటా వృథా కాకుండా, ఇంటర్నెట్‌ లేని వారు కూడా ఆఫ్‌లైన్‌ గూగుల్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ డివైజ్‌లలో కూడా పనిచేస్తుంది. 

ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంటర్నెట్‌ స్లో లేదా మొబైల్‌/ట్యాబ్‌లో డేటా లేనప్పుడు మీకు సూచనలు ఇవ్వడానికి గూగుల్‌ మ్యాప్స్‌ ఆఫ్‌లైన్‌ మ్యాప్‌లను ఉపయోగిస్తుంది. ఆఫ్‌లైన్‌లో డ్రైవింగ్‌ డైరెక్షన్స్‌ మాత్రమే చూపిస్తుంది. ట్రాఫిక్‌ సమాచారం, ప్రత్యామ్నాయ మార్గాలు, లేన్‌ గైడెన్స్‌లను చూపించదు. 

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌ ఉపయోగించుకోవడం ఎలా? 

మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌/ట్యాబ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.

ఫోన్‌ లేదా ఇతర డివైజ్‌లకు ఇంటర్నెట్‌ తప్పనిసరి.

మీరు వెళ్లాలనుకునే ఊరు లేదా ప్రాంతం  పేరును సెర్చ్‌ చేయండి.

తర్వాత కింద భాగంలో మీరు వెళ్లాలనుకున్న అడ్రస్‌ పేరు టైప్‌ చేయండి.

ఇప్పుడు డౌన్‌లోడ్‌ ఆఫ్‌లైన్‌ మ్యాప్‌పై క్లిక్‌ చేసి  మ్యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఇక ఇంటర్నెట్‌ లేకున్నా ఆఫ్‌లైన్‌లోనే గూగుల్‌ మ్యాప్‌..ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలో రూట్‌ను చూపిస్తుంది.

ఐఓఎస్‌లో ఆఫ్‌లైన్‌ మ్యాప్‌ను ఉపయోగించడం ఎలా?

ఐఫోన్‌ లేదా ఐప్యాడ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేయండి.

ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

వెళ్లాలనుకునే ప్లేస్‌ను సెర్చ్‌ చేయండి.

కింది భాగంలో వెళ్లాలనుకునే ప్లేస్‌, అడ్రస్‌ను టైప్‌ చేయండి. 

ఆ తర్వాత డౌన్‌లోడ్‌ ఆఫ్‌లైన్‌ మ్యాప్‌పై క్లిక్‌ చేసి   యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.