బన్సీలాల్‌పేట్: ఇంటి నుంచి బయట అడుగు పెట్టకుండానే ఓ వెటరన్ అథ్లెట్ హాఫ్ మారథాన్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని మాణికేశ్వరీ నగర్‌కు చెందిన 56 ఏండ్ల బొల్లెపల్లి కుమార్.. ఆదివారం 4 గంటల 53 నిమిషాల్లో 22.63 కిలోమీటర్లు (32,338 అడుగులు) నడిచాడు. ‘పేసర్’ యాప్‌లో తన నడకను రికార్డు చేసిన కుమార్.. ఢిల్లీకి చెందిన వాకథాన్ ఇండియా సంస్థకు వివరాలు పంపాడు.