ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 03, 2021 , 10:52:26

టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు క్వాలిఫై కావాలంటే..

టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు క్వాలిఫై కావాలంటే..

చెన్నై: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో ఇప్ప‌టికే ఒక బెర్త్ ఖరారైంది. సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా త‌న టూర్‌ను ర‌ద్దు చేసుకోవ‌డంతో న్యూజిలాండ్ నేరుగా ఫైన‌ల్ చేరింది. ఇప్పుడు మ‌రో బెర్త్ కోసం ఇండియా, ఇంగ్లండ్ ఫైట్ చేయ‌నున్నాయి. శుక్ర‌వారం నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఈ రెండు టీమ్స్‌కూ కీల‌కం కానుంది. ప్ర‌స్తుతం టేబుల్లో 71.7 % పాయింట్ల‌తో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌ర్వాత 70% పాయింట్ల‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 69.2% పాయింట్ల‌తో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 68.7% పాయింట్ల‌తో ఇంగ్లండ్ నాలుగోస్థానంలో ఉన్నాయి.

ఇండియా క్వాలిఫై కావాలంటే..

ఇండియా ఫైన‌ల్‌కు క్వాలిఫై కావాలంటే ఇంగ్లండ్‌పై క‌నీసం 2 లేదా అంత‌కంటే ఎక్కువ విజ‌యాలు సాధించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో ఇంగ్లండ్ మాత్రం నాలుగు టెస్టుల్లో క‌నీసం మూడు గెలిస్తేనే ఫైన‌ల్‌కు క్వాలిఫై అవుతుంది. ఆస్ట్రేలియా విష‌యానికి వ‌స్తే ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ డ్రా అయితేనే ఆ టీమ్ ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఇంగ్లండ్‌పై ఇండియా 2-0, 2-1, 3-0, 3-1 లేదా 4-0తో గెలిస్తే టాప్ ప్లేస్‌తో ఫైన‌ల్‌కు క్వాలిఫై అవుతుంది. ఇక ఇంగ్లండ్ విష‌యానికి వ‌స్తే ఆ టీమ్ ఇండియాపై 3-0, 3-1 లేదా 4-0తో గెలిస్తేనే ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ డ్రా అయినా లేక‌పోతే ఇండియా కేవ‌లం 1-0తో సిరీస్ గెలిచినా లేదంటే ఇంగ్లండ్ 1-0, 2-0 లేదా 2-1తో గెలిచినా ఆస్ట్రేలియా ఫైన‌ల్‌కు వెళ్తుంది. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ జూన్ 18 నుంచి 22 వ‌ర‌కూ లండ‌న్‌లోని లార్డ్స్‌లో జ‌ర‌గ‌నుంది. 

VIDEOS

logo