సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 00:38:36

ద్రవిడ్‌ సలహాల వల్లే.. స్పిన్‌లో మెరుగయ్యానన్న పీటర్సన్‌

ద్రవిడ్‌ సలహాల వల్లే.. స్పిన్‌లో మెరుగయ్యానన్న పీటర్సన్‌

లండన్‌: దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సలహాల వల్లే స్పిన్‌ ఆడటంలో మెరుగయ్యానని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్లో భాగంగా ద్రవిడ్‌, సెహ్వాగ్‌తో కలిసి ఆడటాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. పీటర్సన్‌ ఆదివారం ఓ చాట్‌ షోలో మాట్లాడుతూ.. ‘ద్రవిడ్‌ నాకో అందమైన మెయిల్‌ పంపాడు. అందులో స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో వివరంగా ఉంది. అది అర్థం చేసుకుంటే ఎలాంటి బంతినైనా ఆడొచ్చు. అది ఆచరణలోకి తెచ్చాక నాకు ప్రపంచం కొత్తగా అనిపించింది’అని అన్నాడు. 


logo