బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 17:28:12

ధోనీ నన్ను ‘బుడ్డా’ అంటాడు: ఇషాంత్​

ధోనీ నన్ను ‘బుడ్డా’ అంటాడు: ఇషాంత్​

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కొన్నిసార్లు తనను బుడ్డా(ముసలి వ్యక్తి) అంటూ ఆట పట్టిస్తుంటాడని టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. తన భార్య ప్రతిమ కూడా ఇలాగే ఏడిపిస్తుంటుందని , వయసు పరంగా తనకు 32ఏండ్లేనని, కానీ మానసికంగా, ఆలోచనపరంగా అంతకంటే ఎక్కువ ఎదిగానని, అందుకే వారు అలా అంటుంటారని వివరించాడు. క్రిక్​ఇన్ఫో చాట్​షో క్రిక్ బాజీలో భాగంగా దీప్​దాస్ గుప్తాతో ఇషాంత్ మాట్లాడాడు.

“నాకు 32ఏండ్లు. కానీ శారీరకంగా, మానసికంగా నేను అంతకంటే ఎక్కువ ఎదిగా. నా భార్య నన్ను బుడ్డా అంటుంది(ముసలి వ్యక్తి). ధోనీ కూడా.. ‘ఓల్డ్ మ్యాన్ ఎలా ఉన్నావు’ అంటూ మేసెజ్ చేస్తుంటాడు. నాకు 32ఏండ్లే మహీభాయ్​ అని నేను రిప్లే ఇస్తా. అయితే ‘నీ వయసు 32, కానీ, నీ శరీరానికి దాదాపు 52సంవత్సరాలు ఉంటాయి’ అని ధోనీ అంటాడు” అని ఇషాంత్ చెప్పాడు. కాగా ధోనీ, ఇషాంత్ శర్మ మంచి స్నేహితులు. టీమ్​ఇండియా తరఫున ఎక్కువ కాలం కలిసి ఆడిన వీరిద్దరి మధ్య స్నేహ బంధం కూడా బలంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్​లో ఇషాంత్ కన్నా ధోనీ మూడేండ్ల సీనియర్​. కాగా ప్రస్తుతం ఆడుతున్న భారత ప్లేయర్లలో అత్యధిక టెస్టులు(97) ఆడిన ఆటగాడి​గా ఇషాంత్ కొనసాగుతున్నాడు.  అలాగే సుదీర్ఘ ఫార్మాట్​లో 300 వికెట్లకు ఇషాంత్ శర్మ మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు.  


తన భార్య ప్రతిమ, 


logo