శనివారం 23 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 16:26:37

150 కి.మీ. వేగంతో వ‌చ్చే యార్క‌ర్‌ను ఎలా ఆడ‌తారు?

150 కి.మీ. వేగంతో వ‌చ్చే యార్క‌ర్‌ను ఎలా ఆడ‌తారు?

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్ ఈ మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్‌లోఅభిమానుల‌తో మాట్లాడాడు. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చాడు. టీమిండియాతో కీల‌క సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్‌.. స్మిత్‌పై ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు. అత‌ని ప్రొఫెష‌న‌ర్ కెరీర్ నుంచి వ్య‌క్తిగ‌త జీవితం వ‌ర‌కూ ఎన్నో ప్ర‌శ్న‌లు అడిగారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు సీరియ‌స్‌గా స‌మాధానాలు ఇచ్చిన స్మిత్‌.. మ‌రికొన్నింటికి మాత్రం స‌రదాగా స్పందించాడు. ఈ సంద‌ర్భంగా ఒక అభిమాని స్మిత్‌ను ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగాడు. 150 కి.మీ. వేగంతో వ‌చ్చే యార్క‌ర్‌ను ఎలా ఆడ‌తారు అని ఆ అభిమాని అడ‌గ్గా.. దీనికి స్మిత్ స‌ర‌దాగా రియాక్ట‌య్యాడు. బ్యాట్‌తోనే ఆడ‌తాను అంటూ స్మిత్ స‌మాధాన‌మివ్వ‌డంతో ఆ అభిమాని అవాక్క‌య్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో బ్యాట్‌తో పెద్ద‌గా రాణించ‌ని స్మిత్‌.. ఇండియాతో సిరీస్‌లో ఎలా ఆడ‌తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆస్ట్రేలియాకు అత‌ను ఫామ్‌లోకి రావ‌డం చాలా అవ‌స‌రం. 


logo