మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 14, 2020 , 15:04:19

ఐపీఎల్‌ వాయిదాపై షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌

ఐపీఎల్‌ వాయిదాపై షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌

కోల్‌కతా:  దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌  వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మార్చి 29న ఆరంభంకావాల్సిన ఐపీఎల్‌-2020 సీజన్‌ను వచ్చే నెల 15కు బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లను నిర్వహించకపోవడమే శ్రేయస్కరమని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ వ్యవస్థాపకుడు, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తెలిపారు.   శనివారం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశానికి ముందు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల యజమానులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా షారుక్‌ ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై స్పందించారు.

ఆట ముఖ్యం కాదు.. భద్రతే ముఖ్యం

''ఆఫ్‌ ది ఫీల్డ్‌'లో అన్ని ఫ్రాంఛైజీల ఓనర్లను కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది.  ప్రేక్షకులు, ఆటగాళ్లు, మేము మ్యాచ్‌లు ఆడే నగర ప్రజల భద్రతే ముఖ్యం.  కేంద్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను తప్పక పాటించాల్సిందే.  వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని..ఆ తర్వాత లీగ్‌ జరుగుతుందని భావిస్తున్నాం. బీసీసీఐతో పాటు ఫ్రాంఛైజీల ఓనర్లు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని  దృష్టిలో ఉంచుకొని తర్వాత దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలి. అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. తరచూ చేతులను శుభ్రం చేసుకుందామని' షారుక్‌ ట్విటర్లో పేర్కొన్నాడు.


logo
>>>>>>