సోమవారం 25 మే 2020
Sports - Mar 31, 2020 , 19:46:48

ఇంటి పనులు చేస్తున్నా: జ‌స్ప్రీత్ బుమ్రా

ఇంటి పనులు చేస్తున్నా: జ‌స్ప్రీత్ బుమ్రా

క‌రోనా ఎఫెక్ట్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా ట్రోర్నీలన్నీ ర‌ద్ద‌య్యాయి. అంతా స‌రిగ్గా ఉంటే ఇప్పుడు భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఐపీఎల్ జోరుసాగేది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కారణంగా  సామాన్యుల  నుంచి ప్రముఖుల వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.  ముఖ్యంగా భార‌త క్రికెట‌ర్లంతా భార్య‌పిల్ల‌లు, ఇత‌ర కుటుంబ సభ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌, స్పిన్న‌ర్ యుజువేంద్ర చాహ‌ల్ ఫ‌న్నీ వీడియోల‌తో అభిమానుల‌ను త‌ర‌చూ సామాజిక మాధ్య‌మాల్లో అల‌రిస్తున్నారు. తాజాగా టీమిండియా పేస‌ర్ జ‌స్ప్ర‌త్ బుమ్రా ఇంటిని శుభ్రం చేస్తూ ఓ వీడియోను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇంటిని శుభ్రం చేయ‌డమే శారీర‌క క‌స‌ర‌త్తుల‌ని...దీనికి త‌న త‌ల్లి ఎంతో సంతోషిస్తుంద‌ని వీడియోకు త‌న వ్యాఖ్య‌ల‌ను జ‌త చేశాడు.


logo