శుక్రవారం 10 జూలై 2020
Sports - May 31, 2020 , 19:44:11

హాకీ ఇండియా ఆఫీస్‌లో ఇద్దరికి కరోనా

హాకీ ఇండియా ఆఫీస్‌లో ఇద్దరికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఢిల్లీలోని హాకీ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో 14 రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయనున్నారు.  అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగితో పాటు జూనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఇద్దరు ఉద్యోగులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

ఢిల్లీ ప్రభుత్వ పర్యవేక్షణ ప్రొటోకాల్‌ ప్రకారం వీరిద్దరిని వైద్యులు పర్యవేక్షించనున్నారు.  31 మంది ఉద్యోగుల్లో 29 మందికి కరోనా పరీక్ష చేయించుకున్నారు. 25 మందికి నెగెటివ్‌గా తేలింది. 25 మందిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. 


logo