ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 00:50:54

హాకీఇండియా రూ.25లక్షల విరాళం

హాకీఇండియా రూ.25లక్షల విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) రూ.25లక్షలను పీఎం-కేర్స్‌ నిధికి విరాళంగా ప్రకటించింది. కష్టకాలంలో కొంత సాయం చేయాలని నిర్ణయించున్నామని హెచ్‌ఐ అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ చెప్పాడు.  

ఏఐఎఫ్‌ఎఫ్‌ కూడా..

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్‌) కూడా పీఎం-కేర్స్‌ నిధికి రూ.25లక్షలను అందించినట్టు బుధవారం వెల్లడించింది. దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ కోరాడు. 


logo