శనివారం 29 ఫిబ్రవరి 2020
మన్‌ప్రీత్‌సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌'

మన్‌ప్రీత్‌సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌'

Feb 13, 2020 , 23:42:18
PRINT
 మన్‌ప్రీత్‌సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌'

లుసానే: భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. ఎఫ్‌ఐహెచ్‌ ఈ అవార్డులివ్వడం ప్రారంభించినప్పటి (1999) నుంచి ఓ భారత ఆటగాడు ఈ పురస్కారం దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపిస్తున్న 27 ఏండ్ల మన్‌ప్రీత్‌ అవార్డు వేటలో ఆర్థర్‌ వాన్‌ డారెన్‌ (బెల్జియం), లూకాస్‌ విల్లా (అర్జెంటీనా)ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్‌.. 2012 లండన్‌, 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఎఫ్‌ఐహెచ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో దుమ్మురేపిన మన్‌ప్రీత్‌.. మన జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.  ‘కొంత కాలంగా మా జట్టు బాగా ఆడుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గొప్ప విజయంగా భావిస్తున్నా. ఎఫ్‌ఐహెచ్‌ అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. ఈ పురస్కారాన్ని మా జట్టు సభ్యులకు అంకితమిస్తున్నా’ అని మన్‌ప్రీత్‌ అన్నాడు.
logo