సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:27

హామిల్టన్‌ చరిత్ర

హామిల్టన్‌ చరిత్ర

  • అత్యధిక టైటిళ్లతో ఫార్ములావన్‌లో రికార్డు 

పోర్టిమావ్‌: ఫార్ములా వన్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన రేసర్‌గా బ్రిటన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ చరిత్ర సృష్టించాడు. పోర్చుగీస్‌ గ్రాండ్‌ప్రి విజేతగా నిలిచిన అతడు కెరీర్‌లో 92వ టైటిల్‌ ఖాతాలో వేసుకొని.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జర్మనీ రేసర్‌ మైకేల్‌ షూమాకర్‌ (91 టైటిళ్లు)ను అధిగమించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పోర్చుగీస్‌ రేసును పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మెర్సిడెస్‌ రేసర్‌ హామిల్టన్‌.. రెండోస్థానంలో నిలిచిన వాల్తెరీ బొటాస్‌ కంటే 25.6 సెకన్ల ముందే లక్ష్యాన్ని దాటి సత్తాచాటాడు. మూడో స్థానంలో రెడ్‌బుల్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నిలిచాడు. కాగా ఓ ల్యాప్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు లూయిస్‌ ఖాతాలో అదనపు పాయింట్‌ కూడా చేరింది. దీంతో 256 పాయింట్లతో ఈ ఏడాది డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో హామిల్టన్‌ ఎంతో ముందుండగా.. రెండోస్థానంలోని బొటాస్‌ (179) అతడి దరిదాపుల్లో కూడా లేడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హామిల్టన్‌కు ఈ ఏడాది ఇది ఎనిమిదో టైటిల్‌ కావడం విశేషం.