శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 03, 2020 , 17:37:39

డాక్టర్ల‌పై దాడులు చూస్తుంటే బాధేస్తున్న‌ది: హిమాదాస్‌

డాక్టర్ల‌పై దాడులు చూస్తుంటే బాధేస్తున్న‌ది:  హిమాదాస్‌

న్యూఢిల్లీ: ప‌్రాణాల‌కు తెగించి క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న డాక్ట‌ర్ల‌పై దాడులు చేయ‌డాన్ని చూస్తుంటే బాధ‌గా ఉంద‌ని భార‌త స్టార్ స్ప్రింట‌ర్ హిమాదాస్ పేర్కొంది. శుక్ర‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో జ‌రిగిన‌ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది. ప్ర‌ధాని సూచించిన ఐదు సూత్రాల‌ను ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లెందుకు ప్ర‌య‌త్నిస్తున్న హిమా.. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పిలుపునిచ్చింది. 

ప్ర‌ధానితో వీడియో స‌మావేశం అనంత‌రం ఓ వార్త సంస్థ‌తో మాట్లాడుతూ.. `క‌ష్ట‌కాలంలో సేవ‌లందిస్తున్న సిబ్బందిపై దాడులు జ‌రుగ‌డం చూస్తుంటే బాధేస్తున్న‌ది. డాక్ట‌ర్లు, పోలీసుల‌పై రాళ్లు రువ్వ‌డం ఎంత మాత్రం సరైంది కాదు` అని పేర్కొంది. ప్ర‌ముఖ వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను మాట్లాడుతూ.. `లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సిన అవ‌స‌రముంది. సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి` అని చెప్పింది. మ‌హ‌మ్మారిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం 49 మంది క్రీడారంగ ప్ర‌ముఖుల‌తో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. 


logo