శుక్రవారం 29 మే 2020
Sports - Apr 11, 2020 , 00:05:56

లాక్​డౌన్ ఉల్లంఘన.. క్రికెటర్​కు జరిమానా

లాక్​డౌన్ ఉల్లంఘన.. క్రికెటర్​కు జరిమానా

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ను అందరూ పాటించాలని క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. మరోవైపు ఓ యువ క్రికెటర్ మాత్రం లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురయ్యాడు.

హిమాచల్ ప్రదేశ్ ఆల్​రౌండర్ రిషి ధవన్ తన సొంతకారులో బ్యాంక్​కు వెళ్లి వస్తుండగా పోలీసులు ఆపారు. అయితే, అతడి వద్ద ఎలాంటి వాహన పాస్​ లేదు. దీంతో పోలీసులు రిషికి రూ.500లు జరిమానా విధించారు. కాగా, మినహాయింపు సమయమైన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యే ధవన్ బయటికి వచ్చినా.. పాస్ లేని కారణంగానే అతడికి జరిమానా పడింది. అక్కడే అతడు జరిమానా మొత్తాన్ని పోలీసులకు చెల్లించాడు.

రిషి ధవన్ టీమ్​ఇండియా తరఫున 2016లో మూడు వన్డేలు, ఓ టీ ట్వంటీ ఆడాడు. దేశవాళీ క్రికెట్​లో రిషి ధవన్ బాగా రాణిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ తరఫున 79ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ల్లో అతడు 3,702 పరుగులు చేశాడు. అలాగే 308వికెట్లను పడగొట్టాడు. లిస్ట్ -ఏ క్రికెట్​లోనూ రిషి 96మ్యాచ్​లు ఆడి 1777 పరుగులు చేయడంతో పాటు 125వికెట్లు తీసి సత్తాచాటాడు. 


logo