బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 00:04:23

సాధనకు అనుమతివ్వండి

సాధనకు అనుమతివ్వండి

న్యూఢిల్లీ: మైదానంలో సాధన చేసేందుకు అనుమతినివ్వాలని భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కోరింది. కొవిడ్‌-19 విజృంభిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాటోర్నీలన్ని రద్దుకాగా.. పలువురు అథ్లెట్లు పటియాలాలోని జాతీయ క్రీడా ప్రాంగణం (ఎన్‌ఐఎస్‌)లో ఇండోర్‌ సాధన చేస్తున్నారు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా హాస్టల్‌ గదులకే పరిమితమైన తమకు వేర్వేరు సమయాల్లో రెండు గంటలపాటు గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని హిమాదాస్‌ కేంద్ర మంత్రికి లేఖ రాసింది. ‘మైదానంలో సాధన చేసుకునే చాన్స్‌ ఇవ్వాలని హిమతో పాటు మరికొందరు అథ్లెట్లు కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశారు. అయితే గుంపులు గుంపులుగా కాకుండా.. ఒక్కొక్కరిగానైనా అవకాశం ఇస్తే బాగుంటుందని అందులో పేర్కొన్నారు’ అని జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ రాధకృష్ణన్‌ తెలిపారు.


logo