గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 03:19:33

ఎన్‌ఐఎస్‌లో నాణ్యత లేని ఆహారం

ఎన్‌ఐఎస్‌లో నాణ్యత లేని ఆహారం

  • హిమదాస్‌ సహా మరికొందరు అథ్లెట్ల ఫిర్యాదు 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ క్రీడా శిక్షణ కేంద్రం పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎస్‌-ఎన్‌ఐఎస్‌)లో ఇస్తున్న ఆహారంపై అక్కడి అథ్లెట్లు అసంతృప్తిగా ఉన్నారు. ఆగస్టులో తమకు సరైన ఆహారం ఇవ్వలేదని, వంటశాలల్లోనూ శుభ్రత లేదని యువ స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ సహా మరికొందరు అథ్లెట్లు సాయ్‌కు ఫిర్యాదు చేశారని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కొన్నిసార్లు ఆహారంలో వెంట్రుకలు, గోర్లు కూడా వచ్చాయని చెప్పారట.  దీంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీని కూడా సాయ్‌ ఏర్పాటు చేసింది.


logo