ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 16:47:14

భావోద్వేగాలను దాచుకోవడమే కీలకం: రోహిత్

భావోద్వేగాలను దాచుకోవడమే కీలకం: రోహిత్

న్యూఢిల్లీ: కెప్టెన్​గా ఉన్నప్పుడు తనను తాను జట్టులో తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తిగా భావిస్తానని ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అన్నాడు. సారథిగా ఉన్నప్పుడు మిగిలిన ఆటగాళ్లు ఎంతో ముఖ్యమని భావించి ప్రాధాన్యమివ్వాలని, ఈ సూత్రం తనకు బాగా ఉపయోగపడిందని బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే కెప్టెన్​గా ఉన్న సమయంలో కోపం, భావోద్వేగాలను దాచుకోవడం ఎంతో ముఖ్యమని హిట్​​మ్యాన్ అభిప్రాయపడ్డాడు.  

“కెప్టెన్​గా ఉన్నప్పుడు, నువ్వే తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తి.. అనే విధానాన్ని నేను నమ్ముతాను. ఇలా అయితే ఎక్కువ విషయాల్లో జట్టులోని ఇతర ఆటగాళ్లు ముఖ్యమైన వారవుతారు. అయితే కెప్టెన్లకు వారివారి శైలి ఉంటుంది.  నాకైతే ఈ పద్ధతి సత్ఫలితాలను ఇచ్చింది. సాధారణంగా కోపం, చిరాకు వస్తాయి. కానీ కెప్టెన్​గా ఉన్నప్పుడు అది జట్టు సభ్యులకు చూపించకూడడు. సారథిగా కోపం, భావోద్వాగాలను దాచుకోవడం ఎంతో కీలకం” అని రోహిత్  శర్మ చెప్పాడు. ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ కెప్టెన్​గా జట్టుకు నాలుగు టైటిళ్లు అందించిన రోహిత్.. టోర్నీలో శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా ఉన్నాడు. 


logo