గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 00:30:35

మత్తులో.. దంచికొట్టాడు

మత్తులో.. దంచికొట్టాడు

జొహాన్నెస్‌బర్గ్‌: వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని బద్దలుకొట్టిన జట్టుగా దక్షిణాఫ్రికా సంచలనం సృష్టించి 14ఏండ్లు పూర్తయ్యాయి. 2006 మార్చి 12న జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 434పరుగులు బాదితే.. సఫారీ బ్యాట్స్‌మెన్‌  విశ్వరూపం చూపి జట్టును గెలిపించారు. ఆ చరిత్రాత్మక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షల్‌ గిబ్స్‌(111 బంతుల్లో 175పరుగులు; 21ఫోర్లు, 7సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్‌ ముందురోజు గిబ్స్‌.. స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి వరకు ఫుల్‌గా మందుకొట్టాడట. ఆ తర్వాతి రోజు హ్యాంగ్‌ఓవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగి, ఆసీస్‌ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ఈ విషయాన్ని గిబ్స్‌ స్వయంగా తన ఆత్మకథ ‘టు ద పాయింట్‌'లో వెల్లడించాడు. కాగా, ఇప్పటికీ వన్డేల్లో 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించిన అరుదైన రికార్డు దక్షిణాఫ్రికా పేరిటే ఉంది. 


logo