శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 16:54:27

ఓటమి అంటే కోహ్లికి ద్వేషం : అనుష్క

ఓటమి అంటే కోహ్లికి ద్వేషం : అనుష్క

ముంబై: ఓటమి అంటే భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ద్వేషం అని చెప్పారు ఆయన సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మ. విరాట్ ను బోర్డు ఆటల్లో ఓడించి బాధించడం చాలా ఇష్టమని చెప్తున్నారీ ముద్దుగుమ్మ.

మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్టివ్ ప్రశ్న-జవాబు సెషన్‌లో అభిమాని అడిగినప్పుడు .."నేను అతడ్ని ఏదైనా బోర్డు గేమ్‌లో ఓడించి, దాన్ని రుద్దుకుంటే అతడికెంతో చికాకు. అతను విజయం కోల్పోవడాన్ని ద్వేషిస్తాడు!" అని అనుష్క చెప్పింది. విజయవంతమైన సంబంధాలను సృష్టించడానికి సహాయపడే అంశాల గురించి కూడా అనుష్క మాట్లాడారు.

"విశ్వాసం, ప్రేమ అనేది అంగీకారం అని తెలుసుకోవడం, మంచి సంబంధం యొక్క నిబద్ధత. వ్యక్తుల మధ్య అవగాహన వారి అత్యున్నత మానవ సామర్థ్యంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది" అని ఆమె చెప్పారు .

విరాట్, అనుష్క జంట ఇటలీలో 2017 లో వివాహం చేసుకున్నారు.


logo