శనివారం 08 ఆగస్టు 2020
Sports - Jul 14, 2020 , 10:52:24

బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్‌ అమీన్‌

బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్‌ అమీన్‌

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా హేమంగ్‌ అమీన్‌ నియమితులయ్యారు. అమీన్‌ ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు.  రాహుల్‌ జోహ్రీ  బీసీసీఐ సీఈవోగా రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉన్నది.  రెండు నెలల్లో కొత్త సీఈవోను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నది. అప్పటి వరకూ అమీన్‌..తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హేమంగ్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా బోర్డు  అనుబంధ సంస్థలకు అంతర్గతంగా  సమాచారం అందించినట్లు తెలిసింది. 


logo