శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 17:29:01

కన్నీటి పర్యంతమైన భారత అమ్మాయిలు

కన్నీటి పర్యంతమైన భారత అమ్మాయిలు

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరిందంటే ఓపెనర్‌ షఫాలీ వర్మ బ్యాటింగే కారణం. టోర్నీ ఆసాంతం యువ సంచలనం మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కీలకమైన తుది సమరంలో షఫాలీ కేవలం 2 పరుగులకే ఔటవగానే భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలవడంతో భారత అమ్మాయిలు కన్నీటి పర్యంతమయ్యారు. ఐదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో ఆసీస్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. 

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన 16ఏండ్ల షఫాలీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సహచర క్రీడాకారిణి వర్మను ఓదార్చింది. తుది సమరంలో భారత్‌ ఓడినప్పటికీ భారతీయులు అమ్మాయిలకు మద్దతుగా నిలిచారు. గతంలో ఏ జట్టుకు సాధ్యం కాకపోయినప్పటికీ తొలిసారి ఫైనల్‌ చేసి అబ్బురపరిచారని కొనియాడారు. 16ఏండ్ల వయసులోనే షఫాలీ చూపిస్తున్న తెగువకు మేమంతా ఫిదా అయినట్లు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. logo