గురువారం 21 జనవరి 2021
Sports - Dec 14, 2020 , 02:32:34

శారీరక శ్రమతో ఆరోగ్యం:మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

శారీరక శ్రమతో ఆరోగ్యం:మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : శారీరక శ్రమతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర  క్రీడా, పర్యాటక శాఖమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో సీఐఐ-125వ వార్షికోత్సవం సందర్భంగా సీఐఐ-యూఆర్‌ లైఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ రన్‌-2020ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వ్యాయామం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని, ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ క్రీడలకు  అధిక ప్రాధాన్యం కల్పించారని, క్రీడాకారులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్టర్‌ యూనివర్స్‌ మోతెశామ్‌ అలీఖాన్‌, సీఐఐ తెలంగాణ మాజీ చైర్మన్‌ సంజయ్‌సింగ్‌, బ్రిటీష్‌ డిప్యూటీ  హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, డిఫెన్స్‌ ప్యానెల్‌ తెలంగాణ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   


logo