బుధవారం 08 జూలై 2020
Sports - Jun 13, 2020 , 01:24:42

సర్ఫరాజ్‌కు పిలుపు

 సర్ఫరాజ్‌కు పిలుపు

లాహోర్‌: ఇంగ్లండ్‌ పర్యటన కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) శుక్రవారం 29 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో యువ ఆటగాడు హైదర్‌ అలీ తొలిసారి చోటు దక్కించుకోగా.. మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కూడా మరో చాన్స్‌ లభించింది. గతేడాది అక్టోబర్‌ తర్వాత సర్ఫరాజ్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. 2016లో చివరిసారి టెస్టు ఆడిన పేసర్‌ సోహైల్‌ను తిరిగి ఎంపిక చేయడం విశేషం. స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ అమీర్‌తో పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హరీస్‌ సోహెల్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ పర్యటన నుంచి తప్పుకుంటున్నట్లు ముందే ప్రకటించిడంతో వారి పేర్లను పరిగణించలేదని పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌, హెడ్‌కోచ్‌ మిస్బాఉల్‌ హక్‌ తెలిపాడు.

తాజావార్తలు


logo