బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 14, 2020 , 19:19:48

టీమిండియా త‌రువాతి కెప్టెన్ అత‌డే.. రోహిత్ శ‌ర్మ కాదు : అకాశ్ చోప్రా

టీమిండియా త‌రువాతి కెప్టెన్ అత‌డే.. రోహిత్ శ‌ర్మ కాదు : అకాశ్ చోప్రా

భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి కేఎల్ రాహుల్ ఆదర్శ వారసుడు కాగలడని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అయితే ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సార‌ధిగా రాహుల్ ప‌నితీరును బట్టి త‌దుప‌రి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆకాశ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. తాజాగా ఆకాశ్ ఫేస్‌బుక్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ ఈ విధంగా స్పందించాడు.

'రాహుల్ కెప్టెన్సీ బాగుంటుందని నాకు ఆశ ఉంది. ఐపీఎల్‌లో అత‌డు జ‌ట్టును ఎలా న‌డిపిస్తాడో  చూడాలి. అతను ఏ వ్యూహాలను ఉపయోగిస్తున్నాడో అప్పుడు ఒక ఆలోచ‌న‌ వస్తుంది. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ  ఒకే వ‌య‌స్సు వాళ్లు కావ‌డంతో ఒకేసారి కెప్టెన్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ప్పుడు వారికి రాహుల్ అవ‌కాశం కాగ‌ల‌డు.' అని చోప్రా చెప్పాడు. 

'ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న‌ప్పుడు జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను విరాట్‌కు అప్ప‌గించిన‌ట్లు.. విరాట్ కూడా ఎప్పుడో ఒక‌రోజు త‌న బాధ్య‌త‌ల‌ను ఇంకొక‌రికి అప్ప‌గించ‌క త‌ప్ప‌దు. అప్పుడు రాహుల్ ముందు వ‌రుస‌లో ఉంటాడ‌ని నేను అనుకుంటున్నా. అయితే రాహుల్ కెప్టెన్‌గా రాణించ‌గ‌ల‌డా అనేది ఈ ఐపీఎల్‌తో తెలిసిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డి వ్య‌వ‌హార శైలి, ఆట‌ను చూసిన నాకు రాహుల్ క‌చ్చితంగా మంచి కెప్టెన్ అవుతాడ‌ని నేను అనుకుంటున్నా' అని అకాశ్ చోప్రా అన్నాడు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo