ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 13, 2020 , 21:24:12

హెడెన్ ఇన్నింగ్స్ నా ఐపీఎల్ బెస్ట్‌: రైనా

హెడెన్ ఇన్నింగ్స్ నా ఐపీఎల్ బెస్ట్‌: రైనా

హెడెన్ ఇన్నింగ్స్ నా ఐపీఎల్ బెస్ట్‌: రైనా 

న్యూఢిల్లీ: క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని క్రికెట‌ర్లు తమ పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకునేందుకు వాడుకుంటున్నారు. అవును ఇన్నేండ్ల ఐపీఎల్‌లో త‌న అత్యుత్త‌మ ఇన్నింగ్స్ ఇదే ట్విట్ట‌ర్ ద్వారా రైనా పంచుకున్నాడు. #మై ఐపీఎల్ మూమెంట్ పేరిట ఈ చెన్నై సూప‌ర్ కింగ్స్(సీఎస్‌కే) సీనియ‌ర్ క్రికెట‌ర్ షేర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. 

2010లో ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదిక‌గా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే హార్డ్‌హిట్ట‌ర్ మాథ్యూ హెడెన్ సెంచ‌రీ(43 బంతుల్లో 93) సెంచ‌రీ త‌న బెస్ట్ అని రైనా పేర్కొన్నాడు. ‘ ఢిల్లీ నిర్దేశించిన 186 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న కోసం బ‌రిలోకి దిగిన సీఎస్‌కే.. హెడెన్ సెంచరీతో అద్భుత విజ‌యాన్నందుకుంది. మాంగూస్ బ్యాట్‌తో హెడెన్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయింది. ఏడు భారీ సిక్స్‌ల‌కు తోడు తొమ్మిది ఫోర్ల‌తో అత‌ను విరుచుకుప‌డ్డ తీరు నాకు ఇప్ప‌టికీ గుర్తు. ఓవైపు పిచ్ స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్నా నీ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టావు. మ‌నం గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం ఆదిలోనే క‌ల్గించావు. నీవు(హెడెన్‌) సంత‌కం చేసిన ఆ మాంగూస్ బ్యాట్  ఇప్ప‌టికీ నా ద‌గ్గ‌ర భ‌ద్రంగా ఉంది ’ అని రైనా చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు బెస్ట్ మూమెంట్ ఏంటో చెప్పాలంటూ డుప్లెసిస్‌ను తాను అడుగుతున్న‌ట్లు రైనా అన్నాడు. 


logo