నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్ టెస్టులు : గంగూలీ

ముంబై : గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మంగళవారం వెల్లడించారు. సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ తొలి వరకు యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘నేను గత నాలుగున్నర నెలల్లో 22సార్లు టెస్ట్ చేయించుకున్నాను.. ఒక్కసారి కూడా పాజిటివ్’గా రాలేదన్నారు. నా చుట్టూ పాజిటివ్ కేసులు ఉన్నాయని, తద్వారా నన్ను నేను పరీక్షించుకోవాల్సి వచ్చిందని అని గంగూలీ పేర్కొన్నారు. ఓ టెక్నాలజీ బ్రాండ్ నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘నేను వృద్ధ తల్లిదండ్రుల వద్ద ఉంటానని. నేను దుబాయికి వెళ్లి వచ్చాను. ప్రారంభంలో చాలా ఆందోళన చెందాను. నా కోసం మాత్రమే కాదు.. కమ్యూనిటీ, ప్రజలు మమ్మల్ని చూస్తున్నారని, దాన్ని మరొకరికి వ్యాప్తి చేయాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం తన క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసిన అనంతరం జాతీయ జట్టు ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ల ఈ నెల 27న తొలి వన్డేతో భారత్ ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ‘ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని, ఆస్ట్రేలియాలో ఎక్కువ కొవిడ్ కేసులు లేవని, దేశ సరిహద్దులు కొద్దికాలం పాటు మూసివేశారన్నారు.
అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కఠినంగా ఉన్నారని, 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం క్రికెటర్లు మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది దేశంలోనే టోర్నీ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తీవ్ర మహమ్మారి కారణంగా ఈ ఏడాది సీజన్ దుబాయి నుంచి యూఏఈకి మారిందని, బయోబబుల్‌లో 400 మంది ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు 30వేల నుంచి 40వేల టెస్టులు చేసినట్లు వివరించారు.
తాజావార్తలు
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు
- అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్ సీఈవో
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు