దుబాయ్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తలకు బలమైన గాయమైన సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెస్సి తన ఆరోగ్యంపై ట్విటర్ ద్వారా అప్డేట్ ఇచ్చాడు. తోటి ఫీల్డర్ మహ్మద్ హస్నైన్ మోకాలు తన తలకు బలంగా తగలడంతో డుప్లెస్సి గ్రౌండ్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. కంకషన్‌కు గురైన అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్లు నిర్వహించారు. అయితే ఈ గాయం నుంచి తాను కోలుకుంటున్నట్లు అతడు ట్విటర్లో వెల్లడించాడు. కంకషన్తో జరిగిందేంటో తాను మరచిపోయానని అతడు ట్వీట్ చేశాడు. తాను కోలుకోవాలని కోరుకుంటూ పంపిన సందేశాలు కృతజ్ఞతలు తెలిపాడు. హోటల్‌కు తిరిగి వచ్చాను. కంకషన్ వల్ల జరిగిందేంటో మరచిపోయాను. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి. త్వరలోనే మళ్లీ ఆడతాను అని డుప్లెస్సి ట్వీట్ చేశాడు.