సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 10, 2021 , 13:07:23

త‌న‌ కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యాచ్ అన్న ల‌క్ష్మ‌ణ్‌.. వీడియో

త‌న‌ కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యాచ్ అన్న ల‌క్ష్మ‌ణ్‌.. వీడియో

హైద‌రాబాద్‌: మ‌న వెరీ వెరీ స్పెష‌ల్ ల‌క్ష్మ‌ణ్ బ్యాట్ ప‌ట్టుకుంటే త‌న మ‌ణిక‌ట్టు మాయాజాలంతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఆడుకోగ‌ల‌డు. అలాగే స్లిప్ ఫీల్డింగ్‌లోనూ అత‌డు స్పెష‌లే. తాను టీమ్‌కు ఆడే రోజుల్లో ద్ర‌విడ్‌కు తోడుగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేవాడు ల‌క్ష్మ‌ణ్‌. అలా త‌న కెరీర్‌లో ఎన్నో క్యాచ్‌ల‌ను అత‌డు అందుకున్నాడు. అయితే కెరీర్‌లో బెస్ట్ క్యాచ్ మాత్రం ఇదే అంటూ బుధ‌వారం ల‌క్ష్మ‌ణ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. 2004లో జ‌రిగిన వీబీ సిరీస్‌లో జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్ష్మ‌ణ్ ఆ క్యాచ్ అందుకున్నాడు. సెకండ్ స్లిప్‌లో ఉన్న అత‌డు.. త‌న కుడివైపు డైవ్ చేసి అందుకున్న ఆ లో క్యాచ్‌ను ఎవ‌రో ట్విట‌ర్లో పోస్ట్ చేస్తే.. ఇదే నా కెరీర్‌లో అందుకున్న బెస్ట్ క్యాచ్ అని లక్ష్మ‌ణ్ రీట్వీట్ చేశాడు. 

VIDEOS

logo