గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 21, 2020 , 23:28:35

తెలివితక్కువ పనులొద్దు

 తెలివితక్కువ పనులొద్దు

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉండకుండా విందులు చేసుకుం టూ తిరుగుతున్న వారిపై క్రికెట్‌  వ్యాఖ్యాత హర్ష భోగ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కొందరి తెలివి తక్కువ పనులు తనను నిరాశకు గురి చేస్తున్నాయని, వారి వల్ల కరోనా వైరస్‌ కట్టడి కోసం పోరాడుతున్న లక్షల మంది కష్టం వృథా అయ్యేలా ఉందని శనివారం ట్వీట్‌ చేశాడు. ‘కొందరు చేస్తున్న తెలివితక్కువ పనులు నన్ను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. చదువుకున్న వారు.. వైరస్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల      (దేశాల) నుంచి వచ్చి పార్టీలు చేసుకుంటున్నారు. కోట్ల మంది సరైన చర్యలు తీసుకున్నా..  వైరస్‌పై పోరులో పట్టు సడలేందుకు కొందరు అవివేకులు చాలు. అందుకే అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి’ అని హర్ష భోగ్లే ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.


logo