సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 15:51:39

అమ్మాయిల ధనాధన్‌ మరికాసేపట్లో...

అమ్మాయిల ధనాధన్‌ మరికాసేపట్లో...

షార్జా: మహిళల మినీ ఐపీఎల్‌ మూడో సీజన్‌ మరికాసేపట్లో  ప్రారంభంకానుంది.   మహిళల టీ20 ఛాలెంజ్‌-2020లో భాగంగా సూపర్‌ నోవాస్‌, వెలాసిటీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే రెండు టైటిళ్లను గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని నొవాస్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది.  తొలి మ్యాచ్‌లో మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీతో ఆ జట్టు బుధవారం తలపడనుంది.

అత్యుత్తమ భారత మహిళా క్రికెటర్లు.. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్ల మేళవింపుతో  క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు  మహిళల ఐపీఎల్‌ సిద్ధమైంది.  ఆస్ర్టేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతుండటంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.   

16ఏండ్ల అమ్మాయి షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్‌, మిథాలీపైనే ఎక్కువగా వెలాసిటీ ఆధారపడి ఉంది. ఇక గత సీజన్‌లో హర్మన్‌ రెండు అర్ధశతకాలతో అదరగొట్టింది.    సుదీర్ఘ విరామం తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్‌, ఆటతీరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.