మెల్బోర్న్: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (2/17; 35 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. లీగ్‌లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున బరిలోకి దిగిన హర్మన్ మొదట బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను ముగించింది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన పోరులో మెల్బోర్న్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసింది. పెర్రీ (50 నాటౌట్), బాల్టన్ (38) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో మెల్బోర్న్ రెనిగేడ్స్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోన్స్ (38), హర్మన్‌ప్రీత్ కౌర్ సత్తాచాటారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హర్మన్ రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించడం విశేషం.