మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 01:09:03

జోరుగా హుషారుగా..

జోరుగా హుషారుగా..

  • ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించిన మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌: రాజకీయాలతో నిత్యం బిజీగా గడిపే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వీకెండ్‌ మజాను ఆస్వాదించారు. శనివారం స్థానిక క్రికెట్‌ స్టేడియంలో యశోద దవాఖాన జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆయన అలరించారు. తొలుత టాస్‌ గెలిచిన మంత్రి హరీశ్‌ రావు సారథ్యంలోని సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. జట్టులో హరీశ్‌రావుతో పాటు జాతీయ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌ఐఎస్‌ఏ) డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌, మైనార్టీ గురుకులాల సొసైటీ చైర్మన్‌ ఏకే ఖాన్‌, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ బరిలో దిగారు. సీవీ ఆనంద్‌ నాలుగు వికెట్లతో విజృంభించగా, హరీశ్‌ రావు తనదైన శైలిలో బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్నారు. మంత్రి మైదానంలో ఉన్నంత సేపు అభిమానులు ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంత్రి ఆకట్టుకున్నారు. యశోద బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ క్రీజులో ఉన్నంతసేపు బ్యాటు ఝులిపించారు. 


logo