గురువారం 16 జూలై 2020
Sports - Apr 29, 2020 , 08:11:00

విరాట్‌, రోహిత్‌ను అడ్డుకోవ‌డ‌మే స‌వాల్‌: ర‌వూఫ్‌

విరాట్‌, రోహిత్‌ను అడ్డుకోవ‌డ‌మే స‌వాల్‌: ర‌వూఫ్‌

న్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జ‌ట్టులో చోటు ద‌క్కితే.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని పాకిస్థాన్ పేస‌ర్ హ‌రీశ్ ర‌వూఫ్ అన్నాడు. ఇటీవ‌ల బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)‌లో స‌త్తాచాటి హ‌రీశ్ ర‌వూఫ్ ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్క‌డంపై దీమా వ్య‌క్తం చేస్తున్నాడు. 

`ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ అంటే అన్నీ దేశాల నుంచి అత్యుత్త‌మ ఆట‌గాళ్లు వ‌స్తారు. వారికి బౌలింగ్ వేయ‌డం స‌వాలుతో కూడుకున్న అంశం. అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌యిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను అడ్డుకునేందుకు ఆతృత‌గా ఎదురుచూస్తున్నా. అలాంటి స్టార్ ఆట‌గాళ్ల‌కు బౌలింగ్ చేస్తే నా ఆత్మ‌విశ్వాసం మ‌రింత పెరుగుతుంది. బీబీఎల్‌లో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచా. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాన్ని కొన‌సాగించాల‌నుకుంటున్నా` అని ర‌వూఫ్ చెప్పాడు. 


logo