శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 00:19:49

హరికృష్ణకు రెండో స్థానం

హరికృష్ణకు రెండో స్థానం

చెన్నై: స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన 53వ బియల్‌ అంతర్జాతీయ చెస్‌ ఫెస్టివెల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. బుధవారం జరిగిన ఆఖరి రౌండ్‌ గేమ్‌లో డేవిడ్‌ అంటోన్‌ గుజ్జారో(స్పెయిన్‌)పై హరికృష్ణ 31 ఎత్తుల్లో విజయం సాధించాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన హరి..ప్రత్యర్థిపై ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఓవరాల్‌గా 36.5 పాయింట్లతో నిలిచాడు. అయితే టేబుల్‌ టాపర్‌ రాడోస్లావ్‌ వోజెక్‌(పోలండ్‌)..నోయల్‌ స్టడర్‌(స్విట్జర్లాండ్‌)పై గెలిచి తన పాయింట్లను 37కు పెంచుకున్నాడు. దీంతో కేవలం అర పాయింట్‌ తేడాతో హరి టైటిల్‌ కోల్పోవాల్సి వచ్చింది. టోర్నీలో తన ప్రదర్శనపై హరి మాట్లాడుతూ ‘బ్లిట్జ్‌ ఫార్మాట్‌ మినహా టోర్నీ ఆసాంతం బాగా జరిగింది. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’ అని అన్నాడు.  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య జరిగిన తొలి ముఖాముఖి టోర్నీ ఇది కావడం విశేషం. 


logo