ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Jul 29, 2020 , 02:15:54

టైటిల్‌ చేరువలో హరికృష్ణ

 టైటిల్‌ చేరువలో హరికృష్ణ

చెన్నై: స్విట్జర్లాండ్‌ వేదికగా జరుగుతున్న 53వ బియల్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళుతున్న హరికృష్ణ టైటిల్‌ దక్కించుకునేందుకు మరింత చేరువయ్యాడు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్‌..ఫ్రాన్స్‌కు చెందిన రోమెన్‌ ఎడ్వర్డ్‌పై 44 ఎత్తుల్లో విజయం సాధించాడు. దీంతో ప్రస్తుతం 32.5 పాయింట్లు దక్కించుకున్న హరి..టాప్‌లో ఉన్న రదోస్లోవ్‌ వోజెక్‌(33)కు అర పాయింట్‌ దూరంలో ఉన్నాడు. బుధవారం జరిగే ఆఖరి రౌండ్‌ పోరులో డేవిడ్‌ అంటోన్‌(స్పెయిన్‌)తో తలపడుతాడు. ఇందులో హరికృష్ణ గెలిచి..మరో గేమ్‌లో వోజెక్‌ ఓడిపోతే టైటిల్‌ ఖాతాలో చేరుతుంది. 


logo