శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 21, 2020 , 01:43:02

హరికృష్ణకు ఏడో స్థానం

హరికృష్ణకు ఏడో స్థానం

చెన్నై:  సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ పి హరికృష్ణ(15.5పాయింట్లు) ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. బ్లిట్జ్‌-2లో రాణించలేకపోయిన హరి తొమ్మి ది రౌండ్లలో మూడు పాయింట్లే సాధించగలిగాడు. జెఫ్రీ షియాంగ్‌(అమెరికా)పై గెలిచిన హరికృష్ణ.. నాలుగు పరాజయాలు ఎదుర్కొని మూడు రౌండ్ల ను డ్రా చేసుకోగలిగాడు.  24పాయింట్లతో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌(నార్వే), వెస్లీ(అమెరికా) టోర్నీ సంయుక్త విజేతలుగా నిలిచారు. 


logo