ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 08, 2020 , 16:27:33

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టిదే

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టిదే

ముంబై:  సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 18 మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు 15 మంది ఆటగాళ్లతో టీమ్‌ను నూతన సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వన్డే జట్టుకు విరాట్‌ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. నూతన సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సునీల్‌ జోషీ నేతృత్వంలోని ఐదుగురు సెలక్టర్ల బృందం సఫారీలతో సిరీస్‌కు జట్టును ఎంపిక చేసింది.

గాయాల నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య , పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడి మిగతా సిరీస్‌కు దూరమైన రోహిత్‌ శర్మకు చోటుదక్కలేదు. భువీ జట్టులోకి రావడంతో మరో పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతనిచ్చారు.  

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, శుభమన్‌ గిల్‌logo