శుక్రవారం 22 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 15:53:24

సిడ్నీ వ‌న్డే.. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచ‌రీ

సిడ్నీ వ‌న్డే.. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచ‌రీ

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. కేవ‌లం 31 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్ల‌తో హార్దిక్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 101 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన టీమ్‌ను ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.  మ‌రోవైపు యాంక‌ర్ రోల్ ప్లే చేస్తున్న ధావ‌న్ కూడా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి.


logo