శనివారం 16 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 20:09:09

4 నెలలుగా నా బిడ్డను చూడలేదు: హార్దిక్‌ పాండ్య

4 నెలలుగా నా బిడ్డను చూడలేదు: హార్దిక్‌ పాండ్య

సిడ్నీ: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య రాబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. టీ20 సిరీస్‌లో బ్యాట్‌తో పరుగుల వరద పారించిన పాండ్య మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. 

ఆతిథ్య ఆసీస్‌తో మూడో టీ20 అనంతరం పాండ్య మాట్లాడుతూ..'చాలా  ఆనందంగా  ఉంది. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గురించి అసలు ఆలోచించలేదు. ఇదంతా జట్టు సమిష్టి కృషి. రెండో వన్డే తర్వాత మిగిలిన మ్యాచ్‌లన్నీంటినీ  నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా పరిగణించాం. అందులో మూడింటిలో గెలుపొందాం. దాంతో సంతోషంగా ఉంది.  నాలుగు నెలల నుంచి నా బిడ్డను చూడలేదు. ప్రస్తుతం నా కుటుంబంతో కొంత సమయం  గడపాలనుకుంటున్నాను' అని పాండ్య చెప్పాడు.