శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 17:22:28

నిన్ను చాలా మిస్సవుతున్నా: హార్దిక్‌ పాండ్య

నిన్ను చాలా మిస్సవుతున్నా: హార్దిక్‌ పాండ్య

దుబాయ్:  ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన తనయుడు అగస్త్యతో ఆడుకుంటున్న త్రో బ్యాక్‌ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఐపీఎల్‌ కోసం రెండు నెలల క్రితం యూఏఈ వచ్చిన హార్డిక్‌ తన కుటుంబంతో గడిపే  సమయాన్ని  కోల్పోతున్నట్లు తెలిపాడు.  అగస్త్యతో కలిసి ఆడుకుంటున్న  వీడియోతో పాటు వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 

 'అగస్త్యతో కలిసి ఆడుకునే సమయాన్ని చాలా మిస్సవుతున్నా. నీతో ఆడుకున్న మధుర జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఈ ఏడాది జనవరిలో సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌తో పాండ్య నిశ్చితార్థం చేసుకున్నాడు.   జూలైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.