ఆదివారం 24 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 16:56:05

వన్డేల్లో హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డు

వన్డేల్లో హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డు

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో  తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున  అత్యంత వేగంగా వెయ్యి పరుగులు మార్క్‌ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.  అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన ఐదో  బ్యాట్స్‌మన్‌ పాండ్యనే కావడం విశేషం.  భారత్‌ తరఫున 857 బంతుల్లోనే  పాండ్య 1000 పరుగులు  పూర్తి చేయడం విశేషం.  

విండీస్‌ హార్డ్‌హిట్టర్‌ ఆండ్రీ రస్సెల్ (767 బంతులు), న్యూజిలాండ్ వికెట్ కీపర్ ల్యూక్ రోంచి (807 బంతులు), పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ (834 బంతులు),  న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ (854 బంతులు) తర్వాత అతి తక్కువ బంతుల్లో 1,000 వన్డే పరుగులు చేసిన ఐదో వేగవంతమైన బ్యాట్స్‌మన్‌ హార్దిక్‌.  ఆతిథ్య ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాండ్య స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  


logo