మంగళవారం 14 జూలై 2020
Sports - Apr 09, 2020 , 20:46:58

పోలీసుల‌కు హార్దిక్ పాండ్యా సెల్యూట్

పోలీసుల‌కు హార్దిక్ పాండ్యా సెల్యూట్

పోలీసుల‌కు హార్దిక్ పాండ్యా సెల్యూట్ 

ముంబై: క‌రోనా వైర‌స్‌పై త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా పోరాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు తాను సెల్యూట్ చేస్తున్నాని భార‌త ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కొవిడ్-19 కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రు ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన వేళ‌..వీధుల్లో విధులు నిర్విర్తిస్తున్న పోలీసుల ప‌నితీరును పాండ్యా ప్ర‌శంసించాడు. ట్విట్ట‌ర్‌లో ముంబై పోలీసులు షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ పాండ్యా ఇలా రాసుకొచ్చాడు. ‘ మ‌మ్మ‌ల్ని కాపాడ‌టానికి దేశ‌వ్యాప్తంగా నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందితో పాటు ముంబై పోలీసుల‌కు నేను క్రుతజ్ఞ‌త‌లు తెలుపుతున్నాను’ అని రాసుకొచ్చాడు. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 

logo