గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 02, 2020 , 08:53:16

టెస్ట్‌ సిరీస్‌కు పాండ్యా దూరం

టెస్ట్‌ సిరీస్‌కు పాండ్యా దూరం

వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమయ్యాడు

న్యూఢిల్లీ: వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమయ్యాడు.  'త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా  దూరంకానున్నాడు. తన గాయంపై మెడికల్‌ రివ్యూ కోసం ఎన్‌సీఏ ఫిజియో ఆశిష్‌ కౌషిక్‌తో కలిసి లండన్‌ వెళ్లిన పాండ్యా ప్రముఖ వెన్నెముక సర్జన్‌ జేమ్స్‌ అలీబోన్‌ వద్ద ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు. అతను ఎన్‌సీఏలోనే ఉండి కోలుకుంటాడు.' అని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.  పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించడంలో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న పాండ్యాకు గతేడాది అక్టోబర్‌లో శస్త్రచికిత్స జరిగింది. logo
>>>>>>